- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐపీఎల్ 2025లోకి మరో భారీ హిట్టర్ ఎంట్రీ
ఐపీఎల్ 2025లో కీలక జట్లను గాయాల బెడద వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే పదుల సంఖ్యలో ప్లేయర్లు గాయాల కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరం కాగా వారి స్థానాల్లో యువ ప్లేయర్లకు అవకాశం దక్కుతుంది.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2025లో కీలక జట్లను గాయాల బెడద వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే పదుల సంఖ్యలో ప్లేయర్లు గాయాల కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరం కాగా వారి స్థానాల్లో యువ ప్లేయర్లకు అవకాశం దక్కుతుంది. ఈ క్రమంలో చెన్నై జట్టులో అరంగేట్రం చేసిన ముగ్గురు యువ ప్లేయర్లు భారీ హిట్టర్లు గా మారుతున్నారు. ఈ సమయంలోనే మరో భారీ హిట్టర్ ఐపీఎల్ 2025లోకి ఎంట్రీ ఇచ్చాడు. గాయం కారణంగా రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) బ్యాటర్ నితీష్ రాణా (Nitish Rana) ఈ 18 సీజన్ లో మిగిలిఉన్న మ్యాచులకు దూరం అయ్యాడు. దీంతో అతని స్థానంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు లువాన్-డ్రే ప్రిటోరియస్‌ను ఎంపిక చేసింది. దక్షిణాఫ్రికాకు చెందిన లువాన్- డ్రే ప్రీటోరియస్ (Luan- Dre Pretorius) 33 టీ20లు ఆడి 911 పరుగులు చేశాడు. అతని అత్యధిక స్కోరు 97. ప్రీటోరియస్‌ను తన బేస్ ధర అయిన INR 30 లక్షలకు RR సొంతం చేసుకుంది.
ఈ యువ ప్లేయర్ దక్షిణాఫ్రికా జట్టు లో మంచి పేరును సంపాదించుకున్నారు. ముఖ్యంగా టీ20 మ్యాచ్ లో తన డిఫరెంట్ బ్యాటింగ్ స్టైల్‌తో బౌలర్లకు చెమటలు పట్టిస్తాడు. మరీ ఈ దక్షిణాఫ్రికా ప్లేయర్ ఎంట్రీ రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) జట్టుకు విజయాలను అందిస్తుందా లేదో తెలియాలంటే వేచి చూడాల్సి ఉంది. కాగా ఈ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు పేలవమైన ఆటతో దారుణమైన ఓటములను చవిచూసింది. మొత్తం 12 మ్యాచులు ఆడి కేవలం 3 విజయాలు, ఆరుపాయింట్లతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో కొనసాగుతోంది. ఈ సీజన్ లో ఆర్ఆర్ కు మరో రెండు మ్యాచులు మిగిలి ఉండగా మే 12న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో, మే 16న పంజాబ్ జట్టుతో రాజస్థాన్ రాయల్స్ పోటీ పడనుంది.






