IPL 2025: సంచలనంగా మారిన జట్టు.. 11 ఏళ్ల తర్వాత ప్లే ఆఫ్‌కు అర్హత

by Malleboina Mahesh |

ఐపీఎల్ 2025 సీజన్ ఎవరూ ఊహించని విధంగా ముందుకు పోతుంది. ఈ సీజన్ లో భారీ అంచనాలు ఉన్న జట్లు పేలవమైన ఆటతీరుతో అట్టడుగు స్థానానికి పరిమితం అవుతున్నాయి.

IPL 2025: సంచలనంగా మారిన జట్టు.. 11 ఏళ్ల తర్వాత ప్లే ఆఫ్‌కు అర్హత
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2025 సీజన్ ఎవరూ ఊహించని విధంగా ముందుకు పోతుంది. ఈ 18వ సీజన్ లో భారీ అంచనాలు ఉన్న జట్లు పేలవమైన ఆటతీరుతో అట్టడుగు స్థానానికి పరిమితం కాగా.. ఎటువంటి అంచనాలు లేకుండా.. యువ ప్లేయర్లతో వచ్చిన జట్లు సంచలన విజయాలు సాధిస్తూ టైటిల్ రేసులో దూసుకుపోతున్నాయి. ఇందులో ముఖ్యంగా గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans), పంజాబ్ కింగ్స్ (Punjab Kings) పేర్లు ముందు వరుసలో ఉన్నాయి. అయితే గుజరాత్ ఇప్పటికే ఒక సీజన్ లో కప్ గెలవగా.. పంజాబ్ మాత్రం తమ తొలి టైటిల్ వేటను కొనసాగిస్తుంది. 2014లో ఫైనల్ చేరినప్పటికి.. కేకేఆర్ చేతిలో ఓడిపోయి రన్నరప్ గా నిలిచింది.

ఈ 2025 సీజన్ లో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer), హెడ్ కోచ్ రికీ పాంటింగ్ నాయకత్వంలో జట్టు గణనీయమైన పురోగతి సాధించింది. శ్రేయాస్ అయ్యర్ యొక్క వ్యూహాత్మక నిర్ణయాలు, పాంటింగ్ యొక్క కోచింగ్ జట్టును 200+ స్కోర్‌లను ఆరు సార్లు సాధించేలా చేసింది. ఇది ఐపీఎల్ రికార్డ్‌తో సమానంగా నిలిచింది. ఆదివారం సాయంత్రం రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో పంజాబ్ కింగ్స్ (PBKS) 11 సంవత్సరాల తర్వాత ఐపీఎల్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఇది ఫ్రాంచైజీకి ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. మరీ భారీ విజయాలతో దూసుకుపోతున్న పంజాబ్ జట్టు ఫైనల్ చేరుకుని తమ తొలి టైటిల్ గెలుస్తుందో లేదో తెలియాలంటే సీజన్ చివరి వరకు వేచి చూడాల్సిందే మరి.

Next Story