కుప్పకూలిన పంజాబ్.. ఈ సీజన్‌లోనే అతి తక్కువ స్కోర్

by Gantepaka Srikanth |
కుప్పకూలిన పంజాబ్.. ఈ సీజన్‌లోనే అతి తక్కువ స్కోర్
X

దిశ, వెబ్‌డెస్క్: కోల్‌కతా(Kolkata Knight Riders)తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్(Punjab Kings) బ్యాటర్లు ఘోరంగా విఫలం అయ్యారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని మరీ ఫెయిల్ అయ్యారు. మొత్తంగా 15.3 ఓవర్లలో కేవలం 111 పరుగులకే కుప్పకూలారు. ఓపెనర్లు ప్రభ్‌సిమ్రాన్ సింగ్(30), ప్రియాన్ష్ ఆర్య(22) తప్ప మిగిలిన బ్యాటర్లంతా చేతులెత్తేశారు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(0), జోష్ ఇంగ్లీష్(02), నేహాల్ వధేరా(10), గ్లెన్ మ్యాక్స్‌వెల్(07), సూర్యాన్ష్ షెగ్డే(04), జాన్సన్(01) ఇలా అందరూ సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. కోల్‌కతా విజయం సాధించాలంటే 112 పరుగులు చేయాల్సి ఉంది. కోల్‌కతా బౌటర్లలో హర్షిత్ రాణా మూడు వికెట్లు, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ చెరో రెండేసి వికెట్లు తీయగా, అన్రిచ్ నార్జే ఒక వికెట్ తీశారు. ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు ఇంత తక్కువ స్కోరుకే పరిమితం కావడం ఈ సీజన్‌లో తొలిసారి.

Next Story

Most Viewed