ఐపీఎల్‌లో ఆ మ్యాచే నా ఫేవరెట్ : అర్ష్‌దీప్ సింగ్

by Harish |

పంజాబ్ కింగ్స్ స్టార్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ ఐపీఎల్‌లో తన ఫేవరెట్ మ్యాచ్ ఏదో రివీల్ చేశాడు.

ఐపీఎల్‌లో ఆ మ్యాచే నా ఫేవరెట్ : అర్ష్‌దీప్ సింగ్
X

దిశ, స్పోర్ట్స్ : పంజాబ్ కింగ్స్ స్టార్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ ఐపీఎల్‌లో తన ఫేవరెట్ మ్యాచ్ ఏదో రివీల్ చేశాడు. తాజాగా స్టార్ స్పోర్ట్స్‌తో అర్ష్‌దీప్ మాట్లాడుతూ.. 2023లో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ తనకు ఫేవరెట్ అని వెల్లడించాడు. ఆ మ్యాచ్‌లో అర్ష్‌దీప్ 4 వికెట్ల ప్రదర్శన చేసి పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ముందుగా పంజాబ్ 214 స్కోరు చేయగా.. ఛేదనలో అర్ష్‌దీప్ దాటికి ముంబై 201 రన్స్‌కే పరిమితమైంది. తాజాగా ఆ మ్యాచ్‌ను గుర్తు చేసుకున్న అర్ష్‌దీప్.. ఆ మ్యాచ్ తన మనసుకు చాలా దగ్గరగా నిలిచిందని చెప్పాడు. ‘వాంఖడేలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌ నాకు బెస్ట్ మ్యాచ్. ముంబై 220 పరుగుల లక్ష్యంతో చేజ్ చేయగా.. నేను నాలుగు వికెట్లు తీశాను. మేమే గెలిచాం. కాబట్టి, ఆ మ్యాచ్ నా మనసుకు చాలా దగ్గరిగా ఉంది. ఆ మ్యాచ్‌‌లోనే ఒత్తిడికి గురికాలేదు. ఆ క్షణాలను ఆస్వాదించా. కొన్ని సందర్భాల్లో ఇలా జరగదు. కానీ, ఒత్తిడిని నన్ను ప్రభావితం చేయకుండానే చూసుకుంటా. ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తొలి టైటిల్ గెలవడానికి నా వంతు సహాయం చేస్తా.’ అని అర్ష్‌దీప్ చెప్పుకొచ్చాడు. ఈ సీజన్‌లో సత్తాచాటుతున్న అర్ష్‌దీప్ 15 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు తీశాడు.


Next Story