- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
IPL 2025 : లక్నోకు గుడ్ న్యూస్.. ఆ యువ సంచలనం వచ్చేశాడు

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-18లో లక్నో సూపర్ జెయింట్స్‌కు గుడ్ న్యూస్. యువ సంచలనం మయాంక్ యాదవ్ గాయం నుంచి కోలుకున్నాడు. తాజాగా జట్టులో కూడా చేరాడు. మయాంక్ రాకను లక్నో ఫ్రాంచైజీ సోషల్ మీడియా వేదికగా బుధవారం వెల్లడించింది. గత సీజన్‌లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన మయాంక తన బౌలింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. 4 మ్యాచ్‌ల్లో 7 వికెట్లు తీశాడు.
దీంతో గతేడాది బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లో టీమిండియా తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అలాగే, ఈ సీజన్ కోసం లక్నో అతన్ని రూ. 11 కోట్లకు అంటిపెట్టుకుంది. అయితే, వెన్ను గాయంతో మయాంక్ గతేడాది అక్టోబర్ నుంచి ఆటకు దూరమయ్యాడు. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో గాయపడ్డాడు. దీంతో లక్నో ఆడిన 7మ్యాచ్‌లకు దూరమయ్యాడు. గాయం నుంచి కోలుకోవడంతో అతను లక్నో జట్టుతో కలిశాడు. ఈ నెల 19న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌లో అతను బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు, లక్నో జట్టు ఆడిన 7 మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు నమోదు చేసింది. గత మ్యాచ్‌లో చెన్నయ్ చేతిలో పరాజయం పాలైంది. అయితే, మయాంక్ రాక ఆ జట్టుకు బలాన్ని ఇచ్చేదే.