- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > IPL 2026 > IPL: సెంచరీతో చెలరేగిన పంత్.. RCB ఎదుట భారీ టార్గెట్
IPL: సెంచరీతో చెలరేగిన పంత్.. RCB ఎదుట భారీ టార్గెట్
by Gantepaka Srikanth |
లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి మైదానం వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru)తో జరుగుతోన్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) బ్యాటర్లు రఫ్పాడించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి మైదానం వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru)తో జరుగుతోన్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) బ్యాటర్లు రఫ్పాడించారు. కెప్టెన్ రిషబ్ పంత్(Rishabh Pant) టాప్ ఆర్డర్ మొత్తం సక్సెస్ అయ్యారు. ఈ సీజన్‌లో చివరి లీగ్ మ్యాచ్ కావడంతో ఆర్సీబీ బౌలర్‌లకు చుక్కలు చూపించారు. రిషబ్ పంత్ సెంచరీ(118)తో అదరగొట్టగా.. కేవలం 37 బంతుల్లోనే 67 పరుగులు చేసి మిచెల్ మార్ష్ అదరహో అనిపించారు. చివర్లో నికోలస్ పూరన్ కూడా తనదైన శైలిలో రాణించారు. మొత్తంగా 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయిన లక్నో.. 227 పరుగులు చేసింది. బెంగళూరు విజయం సాధించాలంటే 228 పరుగులు చేయాలి. ఆర్సీబీ బౌలర్లలో నూవాన్ తుషారా, భువనేశ్వర్ కుమార్, షెఫార్డ్ తలో వికెట్ తీశారు.
Next Story






