- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంతార మూవీ సీన్‌ను రీక్రియేట్ చేసిన రాహుల్.. ఆర్సీబీతో మ్యాచ్‌లో స్పెషల్ సెలబ్రేషన్స్ అందుకేనా?
ఐపీఎల్-18లో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా నాలుగు విజయాలతో జోరుమీద ఉన్నది.

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-18లో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా నాలుగు విజయాలతో జోరుమీద ఉన్నది.బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో గురువారం జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై ఢిల్లీ 6 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. కర్ణాటకకు చెందిన కేఎల్ రాహుల్ సొంతగడ్డపై విధ్వంసకర ఇన్నింగ్స్ ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 53 బంతుల్లో 93 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. విజయం అనంతరం రాహుల్ తనదైన స్టైల్‌లో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. గ్రౌండ్‌లో బ్యాటుతో వృత్తాకారంలో గీసి బ్యాటుతో నేలపై కొట్టాడు.
తాజాగా ఆ స్పెషల్ సెలబ్రేషన్స్ వెనుక ఉన్న కారణాన్ని రాహుల్ వెల్లడించాడు. తన ఫేవరెట్ మూవీ కాంతార నుంచి స్ఫూర్తి పొందినట్టు తెలిపాడు. చిన్నస్వామి స్టేడియం తన అడ్డా అని వ్యాఖ్యానించాడు. ‘చిన్నస్వామి స్టేడియం నాకు చాలా స్పెషల్. నేను చేసుకున్న సెలెబ్రేషన్స్ నా ఫేవరెట్ మూవీ కాంతారలోనివి. దాన్ని ఈ మైదానంలో గుర్తు చేసుకున్నా. ఈ స్టేడియం నా ఇల్లులాంటిది. నేను ఇక్కడే పెరిగా.ఇది నాది.’ అని రాహుల్ చెప్పుకొచ్చాడు. రాహుల్ మాట్లాడిన వీడియోను ఢిల్లీ క్యాపిటల్స్ శుక్రవారం సోషల్ మీడియాలో పోస్టు చేసింది. కన్నడ మూవీ కాంతార బ్లాక్‌బాస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. వరల్డ్ వైడ్‌గా రూ.450 కోట్లు రాబట్టిందని తెలుస్తోంది. ఆ మూవీలో హీరో రిషబ్ శెట్టి కత్తితో చేసే సీన్‌ను, కేఎల్ రాహుల్ సెలబ్రేషన్స్‌ను అటాచ్ చేస్తూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
The way he says 'This is mine' 🥹 pic.twitter.com/DKnWv2HcmN
— Delhi Capitals (@DelhiCapitals) April 11, 2025






