బుమ్రా వ్యాక్సిన్ లాంటివాడు.. బుమ్రాపై ప్రశంసలు కురిపించిన మాజీ క్రికెటర్

by Harish |

బుమ్రాపై భారత మాజీ బౌలర్ వరుణ్ ఆరోన్ ప్రశంసలు కురిపించాడు.

బుమ్రా వ్యాక్సిన్ లాంటివాడు.. బుమ్రాపై ప్రశంసలు కురిపించిన మాజీ క్రికెటర్
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-18లో భాగంగా ఆదివారం జరిగిన ఎలిమినేటర్‌లో గుజరాత్ టైటాన్స్‌పై ముంబై ఇండియన్స్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, ఛేదనలో గుజరాత్ 148/2తో నిలిచిన స్థితిలో ముంబై గెలుపు చాన్స్‌లు సంక్లిష్టమయ్యాయి. ఈ సమయంలో సుందర్‌ను బుమ్రా అవుట్ చేసి మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. అలాగే, 18వ ఓవర్‌లో కేవలం 9 రన్సే ఇచ్చి ముంబై గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో బుమ్రాపై భారత మాజీ బౌలర్ వరుణ్ ఆరోన్ ప్రశంసలు కురిపించాడు. బుమ్రా ఒక వ్యాక్సిన్ వంటి వాడని ప్రశంసించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘బుమ్రా విరుగుడు లాంటివాడు. బౌలింగ్‌లో ఎన్ని సమస్యలైనా ఉండని.. వాటికి అతనే వ్యాక్సిన్. అన్నింటికి పరిష్కారం చూపిస్తాడు. వికెట్లు కావాలంటే వికెట్లు తీస్తాడు. పరుగులు ఆపాలంటే రన్స్ కట్టడిచేస్తాడు. అతనో అద్భుతమైన బౌలర్. అతను తన సామర్థ్యాన్ని నమ్ముకుంటాడు.’ అని చెప్పాడు. ఈ సీజన్‌లో బుమ్రా 11 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు తీశాడు.


Next Story