- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆర్సీబీ, కేకేఆర్ మ్యాచ్ వర్షార్పణం.. కీలక నిర్ణయం తీసుకున్న బెంగళూరు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్ల మధ్య శనివారం జరగాల్సిన మ్యాచ్ వర్షార్పణమైన విషయం తెలిసిందే.

దిశ, స్పోర్ట్స్ : రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్ల మధ్య శనివారం జరగాల్సిన మ్యాచ్ వర్షార్పణమైన విషయం తెలిసిందే. ఐపీఎల్ పున:ప్రారంభంలో జరిగే తొలి మ్యాచే రద్దవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆర్సీబీ మేనేజ్మెంట్ టికెట డబ్బులను రిఫండ్ చేయాలని నిర్ణయించుకుంది. పూర్తి రిఫండ్‌కు చెల్లుబాటు అయ్యే టికెట్ హోల్డర్లందరికీ డబ్బులు వాపసు ఇస్తామని ఫ్రాంచైజీ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. ‘డిజిటల్ టికెట్లు కొనుగోలు చేసిన వారికి టికెట్లు బుక్ చేయడానికి ఉపయోగించిన ఖాతాల్లో 10 పనిదినాల్లో డబ్బులు జమ అవుతాయి.ఒకవేళ ఈ నెల 31లోగా రిఫండ్ కాకపోతే బుకింగ్ డీటెయిల్స్‌ను [email protected]కు మెయిల్ చేయండి. ఫిజికల్ టికెట్లు తీసుకున్న వారు ఎక్కడైతే టికెట్లు కొనుగోలు చేశారో అక్కడ తమ టికెట్లను సరెండర్ చేసి రిఫండ్ తీసుకోవచ్చు. కాంప్లిమెంటరీ టికెట్లకు రిఫండ్ వర్తించదు.’ అని ఆర్సీబీ పేర్కొంది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దవడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. దీంతో 17 పాయింట్లతో నిలిచిన ఆర్సీబీకి దాదాపు ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కినట్టే. మరోవైపు, కోల్‌కతాకు ప్లే ఆఫ్స్ దారులు మూసుకపోయాయి.






