ఐపీఎల్ నుంచి మరో ఎస్‌ఆర్‌హెచ్ ప్లేయర్ ఔట్

by Harish |

ఐపీఎల్-18‌కు మరో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు దూరమయ్యాడు.

ఐపీఎల్ నుంచి మరో ఎస్‌ఆర్‌హెచ్ ప్లేయర్ ఔట్
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-18‌కు మరో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు దూరమయ్యాడు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ స్మరన్ రవిచంద్రన్ గాయం కారణంగా మిగతా సీజన్‌ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ సోమవారం వెల్లడించింది. ఈ సీజన్‌ ఆరంభంలో ఎస్‌ఆర్‌హెచ్ స్పిన్నర్, ఆస్ట్రేలియాకు చెందిన ఆడమ్ జంపా గాయం కారణంగానే టోర్నీకి దూరమైన విషయం తెలిసిందే. జంపా స్థానంలోనే స్మరన్‌ను హైదరాబాద్ జట్టులోకి తీసుకుంది.

అయితే, స్మరన్ ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే టోర్నీ నుంచి నిష్ర్కమించాడు. స్మరన్ స్థానాన్ని సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ భర్తీ చేసింది. విదర్భ స్పిన్ ఆల్‌రౌండర్ హర్ష్ దూబేను జట్టులోకి తీసుకుంది. అతనితో రూ.30 లక్షలకు ఒప్పందం చేసుకుంది. దేశవాళీ క్రికెట్‌లో దూబేకు మంచి రికార్డు ఉంది. 16 టీ20లు, 20 లిస్ట్ ఏ మ్యాచ్‌లు, 18 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో మొత్తం 127 వికెట్లు పడగొట్టడంతోపాటు 941 రన్స్ చేశాడు.

ఇక, ఈ సీజన్‌లో హైదరాబాద్ దారుణంగా విఫలమైంది. ఆడిన 10 మ్యాచ్‌ల్లో మూడింట మాత్రమే నెగ్గింది. ఏడు పరాజయాలతో ప్లే ఆఫ్స్‌కు దాదాపుగా దూరమైంది. నాకౌట్ రౌండ్‌కు చేరుకోవాలంటే అద్భుతమే జరగాలి. మిగతా నాలుగు మ్యాచ్‌ల్లో భారీ విజయాలు నమోదు చేయడంతోపాటు మిగతా జట్ల ఫలితాలు కూడా కలిసిరావాలి. హైదరాబాద్ ముందడుగు వేయడం దాదాపుగా కష్టమే అని చెప్పాలి. ఇవాళ ఉప్పల్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో హైదరాబాద్ తలపడనుంది.


Next Story