IPL 2025: ఎలిమినేటర్ మ్యాచ్ కు ముందు ముంబైకి బిగ్ షాక్ !

by velandi.Saikiran |

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( ipl 2025) చివరి అంకానికి వచ్చింది. ఇవాళ క్వాలిఫైయర్ 1 మ్యాచ్ జరగనుండగా...

IPL 2025: ఎలిమినేటర్ మ్యాచ్ కు ముందు ముంబైకి బిగ్ షాక్ !
X

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( ipl 2025) చివరి అంకానికి వచ్చింది. ఇవాళ క్వాలిఫైయర్ 1 మ్యాచ్ జరగనుండగా... రేపు ఎలిమినేటర్ మ్యాచ్ ( Eliminator match) జరుగుతుంది. ఈ ఎలిమినేటర్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ( GT) వర్సెస్ డేంజరస్ ముంబై ఇండియన్స్ ( Mumbai indians)మధ్య ఫైట్ జరగనుంది. అయితే ఈ ఎలిమినేటర్ మ్యాచ్ కంటే ముందు... ముంబై ఇండియన్స్ కు ఊహించని ఎదురు దెబ్బ తగిలేలా కనిపిస్తోంది.

ముంబై ఇండియన్స్ జట్టు తరుపున ఈసారి బరిలోకి దిగిన దీపక్ చాహర్ కు ( Deepak Chahar) గాయం అయిందని వార్తలు వస్తున్నాయి. ప్రాక్టీస్ సమయంలో.... అతనికి చిన్న గాయం అయిందని అంటున్నారు. దీంతో... గుజరాత్ టైటాన్స్ జట్టుతో జరిగే మ్యాచ్ కు దీపక్ చాహర్ దూరం కాబోతున్నట్లు సమాచారం అందుతుంది. ఒకవేళ దీపక్ చాహర్... ఎలిమినేటర్ మ్యాచ్ కు దూరమైతే ముంబై ఇండియన్స్ కు ఎదురుదెబ్బ తగిలినట్లే అవుతుంది.

ఇక అతని స్థానంలో ఇంగ్లాండ్ ఆటగాడు రిచర్డ్ గ్లీసన్ ( Richard Glesson) బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. ఇది ఇలా ఉండగా... ఈనెల 30వ తేదీన అంటే రేపటి రోజున... ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ చండీఘర్ వేదికగా జరగనుంది. అటు క్వాలిఫైయర్ 1 లో భాగంగా ఇవాళ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య ఇవాళ ఫైట్ జరగనుంది.

Next Story