- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BCCI: హార్దిక్, నెహ్రాపై బీసీసీఐ గుస్సా.. ఇద్దరికీ ఫైన్!
ముంబై కెప్టెన్ హార్దిక్, గుజరాత్ కోచ్ నెహ్రాలకు బీసీసీఐ జరిమానాలు వేసింది. నెహ్రాకు డీమెరిట్ పాయింట్ కూడా ఇచ్చింది.

దిశ, స్పోర్ట్స్: ముంబై ఇండియన్స్ సారధి హార్దిక్ పాండ్యా, గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రాలపై బీసీసీఐ (BCCI) క్రశిక్షణ చర్యలు తీసుకుంది. ముంబై, గుజరాత్ జట్ల మధ్య జరిగిన మ్యాచులో నిర్ణీత సమయంలో ముంబై జట్టు ఓవర్లు ముగించలేదు. ఇలా జరగడం ఈ సీజన్లో రెండోసారి కావడంతో పాండ్యాకు రూ.24 లక్షల జరిమానా విధించారు. అలాగే ఇంపాక్ట్ ప్లేయర్ సహా మిగతా జట్టు సభ్యులకు మ్యాచ్ ఫీజులో 25% లేదా రూ.6 లక్షల ఫైన్ విధిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.
నెహ్రాకూ ఫైన్..
అలాగే క్రీడాస్ఫూర్తిని దెబ్బతీసేలా వ్యవహరించినందుకు గుజరాత్ హెడ్కోచ్ ఆశిష్ నెహ్రాకు కూడా మ్యాచ్ ఫీజులో 25% కోత విధిస్తున్నట్లు ఐపీఎల్ నిర్వాహకులు (IPL) వెల్లడించారు. దీంతోపాటు నెహ్రాకు ఒక డీమెరిట్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే నెహ్రా ఏం చేశాడో ఐపీఎల్ నిర్వాహకులు వెల్లడించలేదు. కాగా, వర్షం వల్ల ముంబై, గుజరాత్ మ్యాచ్కు అంతరాయం కలిగినప్పుడు అంపైర్లతో నెహ్రా వాగ్వాదానికి దిగిన సంగతి తెలిసిందే.






