- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ట్రెండింగ్‌లో బాయ్‌కాట్ ఢిల్లీ క్యాపిటల్స్.. ఫ్యాన్స్‌కు ఎందుకు చిర్రెత్తుకొచ్చింది?
బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ ఒప్పందం చేసుకుంది. దీంతో ఆ జట్టును బాయ్‌కాట్ చెయ్యాలంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ మిగతా మ్యాచులకు విదేశీ ప్లేయర్లు అందుబాటులో లేకపోతే వారి స్థానంలో కొత్తవారితో తాత్కాలిక ఒప్పందాలు చేసుకోవడానికి బీసీసీఐ అనుమతించిన సంగతి తెలిసిందే. ఈ తాజా నిబంధనలను ఈ ఐపీఎల్‌లో ముందుగా ఢిల్లీ క్యాపిటల్స్ ఉపయోగించుకుంది. ఈ టీం విధ్వంసకర ఓపెనర్ జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్.. మిగతా ఐపీఎల్ మ్యాచుల నుంచి తప్పుకున్నాడు. ఈ ఏడాది ఫామ్‌లో లేని మెక్‌గర్క్‌ను ఢిల్లీ కూడా పెద్దగా ఆడించలేదు. ఆరంభంలో కొన్ని మ్యాచులు విఫలమవగానే పక్కన పెట్టేసింది.
అతని స్థానంలో బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ ఒప్పందం చేసుకుంది. త్వరలోనే డబ్ల్యూటీసీ ఫైనల్ ఉండటం వల్ల ఆ టీం స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ మళ్లీ తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలోనే డీసీ ఈ డెసిషన్ తీసుకొని ఉండొచ్చు. అయితే ఈ నిర్ణయం చాలామంది అభిమానులకు నచ్చలేదు. బంగ్లాదేశ్‌లో ఇటీవలి కాలంలో హిందువులపై హింసాత్మక దాడులు జరగడం, ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వం పలుమార్లు భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం తెలిసిందే.
ఈ క్రమంలో ఆ దేశ ప్లేయర్లను వేలంలో ఎవరూ కొనుగోలు చేయలేదు. తాజాగా పాకిస్తాన్, భారత్ మధ్య ఉద్రిక్తతల్లో కూడా పాక్‌కే బంగ్లాదేశ్ మద్దతుగా నిలిచింది. ఇలాంటి నేపథ్యంలో ముస్తాఫిజుర్‌తో డీసీ ఒప్పందం చేసుకోవడం చాలామంది అభిమానులకు మింగుడుపడటం లేదు. ఈ జట్టును బాయ్‌కాట్ చేయాలంటూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.






