- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
SRHకు ప్లేఆఫ్స్‌కు వెళ్లే అవకాశం ఉందా?.. విశ్లేషకులు ఏం చెబుతున్నారంటే?
తొలి మ్యాచ్‌లోనే సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) బ్యాటర్లు విధ్వంసం చేశారు..

దిశ, వెబ్‌డెస్క్: తొలి మ్యాచ్‌లోనే సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) బ్యాటర్లు విధ్వంసం చేశారు.. ప్రత్యర్థి బౌలర్లను ఉతికి ఆరేశారు.. 20 ఓవర్లలో ఏకంగా 286 పరుగులు చేసి.. ప్రత్యర్థి ఎదుట 287 పరుగుల టార్గెట్ పెట్టారు.. ఫైనల్‌గా ఫస్ట్ మ్యాచ్‌లోనే గ్రాండ్ విక్టరీ సాధించారు.. కానీ ఇదంతా తొలి మ్యాచ్ వరకే పరిమితం అయింది. వరుస ఓటములతో అటు యాజమాన్యాన్ని.. ఇటు అభిమానులను SRH ప్లేయర్లు తీవ్రంగా నిరాశ పరుస్తున్నారు. ఇప్పటివరకు 10 మ్యాచులు ఆడిన హైదరాబాద్ జట్టు కేవలం మూడు మ్యాచుల్లోనే విజయం సాధించింది. 7 మ్యాచుల్లో అత్యంత ఘోరంగా ఓటమి చవిచూశారు. దీంతో ప్లేఆఫ్స్ ఆశలపై మరోసారి నీళ్లు చల్లినట్లైంది.
మరో నాలుగు మ్యాచులు మిగిలి ఉన్నా.. ప్లే ఆఫ్స్‌కు వెళ్లే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. అయితే.. ఒక అద్భుతం జరిగితే SRHకు ప్లేఆఫ్స్ వెళ్లే ఛాన్స్ ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. SRH మిగిలిన నాలుగు మ్యాచుల్లో భారీ తేడాతో గెలవాలి.. మరోవైపు పంజాబ్, గుజరాత్ జట్లు ఆడబోయే మ్యాచులన్నీ ఓడాలి. ఈ రెండు జట్లపై ఢిల్లీ గెలవాలి. లక్నో కూడా ఈ రెండు జట్లను ఓడించాలి. అదే సమయంలో SRH, RCBపై ఓడాలి. KKR తాను ఆడబోయే 4 మ్యాచుల్లో 2 గెలవాలి. ఇవన్నీ జరిగితే SRH ప్లేఆఫ్స్‌కు వెళ్లే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఇది సాధ్యమవుతుందో లేదో చూడాలి.






