ధోనీని తండ్రితో పోల్చిన పతిరణ.. కారణం అదేనట

by Harish |

చెన్నయ్ సూపర్ కింగ్స్ జట్టులో ఎం.ధోనీ మార్గదర్శకత్వంలో రాటుదేలిన యువ క్రికెటర్లలో మతీషా పతిరణ ఒకడు.

ధోనీని తండ్రితో పోల్చిన పతిరణ.. కారణం అదేనట
X

దిశ, స్పోర్ట్స్ : చెన్నయ్ సూపర్ కింగ్స్ జట్టులో ఎం.ధోనీ మార్గదర్శకత్వంలో రాటుదేలిన యువ క్రికెటర్లలో మతీషా పతిరణ ఒకడు. ధోనీ కెప్టెన్సీలో 2022లో అరంగేట్రం చేసిన ఈ శ్రీలంక యువ పేసర్ ధోనీ మెంటార్‌షిప్‌లో నాణ్యమైన బౌలర్‌గా ఎదిగాడు. సీఎస్కేలోనే కాకుండా శ్రీలంక జట్టులోనూ ప్రస్తుతం అతను కీలక ప్లేయర్‌గా మారాడు. తాజాగా ధోనీపై పతిరణ ప్రశంసలు కురిపించాడు. క్రికెట్‌లో ధోనీ తనకు తండ్రి‌లాంటివాడని చెప్పాడు.

పతిరణ మాట్లాడిన వీడియోను చెన్నయ్ ఫ్రాంచైజీ ట్విటర్‌‌లో పంచుకుంది. ‘ధోనీ నాకు తండ్రిలాంటివాడు. సీఎస్కేలో అతను నాకు ఇచ్చే సపోర్ట్, మెంటార్‌షిప్, గైడెన్స్ అలాగే ఉంటుంది. ఇంట్లో మా నాన్న ఎలాగైతే ఉంటాడో అలాగే. అందుకే ధోనీని క్రికెటింగ్ ఫాదర్‌గా భావిస్తా.’ అని తెలిపాడు. ఈ సీజన్‌‌లోనూ పతిరణ ఆకట్టుకుంటున్నాడు. గాయం కారణంగా ముంబైతో తొలి మ్యాచ్‌కు అతను దూరమైనా.. ఆ తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో సత్తాచాటాడు. ఆర్సీబీ, రాజస్థాన్ మ్యాచ్‌ల్లో రెండేసి వికెట్లు తీశాడు. పతిరణను చెన్నయ్ రూ.13 కోట్లకు రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే.


Next Story