- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
MS ధోనీ రిటైర్మెంట్‌పై క్లారిటీ
ఐపీఎల్(IPL 2025) నుంచి చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) వికెట్ కీపర్ ఎమ్ఎస్ ధోనీ(MS Dhoni) రిటైర్మెంట్ అవుతారని జరుగుతున్న ప్రచారంపై ఆ జట్టు హెడ్ కోచ్ ఫ్లెమింగ్(Fleming) స్పందించారు.

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్(IPL 2025) నుంచి చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) వికెట్ కీపర్ ఎమ్ఎస్ ధోనీ(MS Dhoni) రిటైర్మెంట్ అవుతారని జరుగుతున్న ప్రచారంపై ఆ జట్టు హెడ్ కోచ్ ఫ్లెమింగ్(Fleming) స్పందించారు. ఆ న్యూస్ ప్రచారం చేసిన వారిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ధోనీ రిటైర్మెంట్‌పై నాకు ఎలాంటి సమాచారం లేదు. ప్రస్తుతం ఆయనతో కలిసి పనిచేయడం చాలా సంతృప్తిని ఇస్తోంది. ఆయన గేమ్‌ను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ధోనీ చాలా స్ట్రాంగ్ మ్యాన్. ఇంకెన్నేళ్లయినా ఆడగలడు. అతని రిటైర్మెంట్ గురించి జట్టులో ఎలాంటి చర్చ జరుగలేదు. అని ఫ్లెమింగ్ చెప్పుకొచ్చారు. కాగా, ఇవాళ ఢిల్లీ జరిగిన మ్యాచ్ అనంతరం ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తారని అంతా భావించారు.
కాగా, ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) హ్యాట్రిక్ ఓటమి చవిచూసింది. చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నైపై ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) 25 పరుగుల తేడాతో విజయం సాధించింది. 184 పరుగుల లక్ష్యఛేదనలో సీఎస్కే 158/5 స్కోరుకే పరిమితమైంది. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీకి ఇది వరుసగా మూడో విజయం కాగా.. చెన్నైకి హ్యాట్రిక్ ఓటమి. ఢిల్లీ జట్టు 15 ఏళ్ల తర్వాత చెన్నైలో సీఎస్కేను ఓడించడం విశేషం.






