CSKvsGT: భారీ విజయంతో ఐపీఎల్ నుంచి నిష్క్రమించిన ధోనీ సేన

by Gantepaka Srikanth |

గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) జట్టు ఘన విజయం సాధించింది.

CSKvsGT: భారీ విజయంతో ఐపీఎల్ నుంచి నిష్క్రమించిన ధోనీ సేన
X

దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) జట్టు ఘన విజయం సాధించింది. 83 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. 231 పరుగుల లక్ష్యఛేదనలో 147 పరుగుల వద్ద గుజరాత్ జట్టు ఆలౌటైంది. సీజన్ చివరి మ్యాచ్ కావడంతో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ప్రారంభించిన చెన్నై బ్యాటర్లు చెలరేగారు. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేశారు. ఆయుష్‌ మాత్రే (34), కాన్వే (52), ఉర్విల్ పటేల్ (37), శివమ్ దూబె (17), డెవాల్డ్ బ్రెవిస్ (57), రవీంద్ర జడేజా (21) రాణించారు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్‌ కృష్ణ 2 వికెట్లు.. సాయి కిశోర్, రషీద్ ఖాన్, షారుక్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. ఇక 231 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టైటాన్స్‌ జట్టు.. 18.3 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటయ్యింది. ఓపెనర్‌ సాయి సుదర్శన్‌ (41) తప్ప.. మిగతావారెవరూ పెద్దగా రాణించలేదు. చివర్లో అర్షద్‌ ఖాన్‌ (20) ఫర్వాలేదనిపించాడు. నూర్‌ అహ్మద్‌, కాంబోజ్‌ చెరో 3 వికెట్లు పడగొట్టగా.. రవీంద్ర జడేజా, 2 వికెట్లు, ఖలీల్‌ అహ్మద్‌, పతిరణ చెరో వికెట్‌ తీశారు.

Next Story