- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IPL 2025: ఈ ఐపీఎల్ లో అత్యుత్తమ రికార్డులివే..
అహ్మాదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ లో ఆర్సీబీ పంజాబ్ పై 6పరుగుల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: అహ్మాదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ లో ఆర్సీబీ పంజాబ్ పై 6పరుగుల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. ఈ సీజన్లో మిగతా జట్లకు చెందిన బ్యాటర్లు అరుదైన కికార్డులు సాధించారు. గుజరాత్ కు చెందిన సాయి సుదర్శన్ 759 పరుగులు చేయగా.. అత్యధిక స్కోర్లు చేసిన రికార్డు కూడా అతనే కైవసం చేసుకున్నాడు. 18వ ఐపీఎల్ లో ఏకంగా 88 ఫోర్లు బాదాడు.
ఇక లక్నో సూపర్ జెయింట్ కు చెందిన నికోలస్ పూరన్ 40 సిక్సులు కొట్టాడు. ఆర్సీబీకి చెందిన రొమారియో షెపర్డ్ 378.57 స్ట్రైక్ రేటు సంపాదించాడు. ఈ సీజన్ మొత్తంలో ఆర్సీబీ ప్లేయర్ విరాట్ కొహ్లీ 8 అర్థశతకాలు చేశాడు. రొమారియో షెపర్డ్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డును కైవసం చేసుకున్నాడు. 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.
వైభవ్ సూర్యవంశీ 35 బంతుల్లో సెంచరీ చేయగా.. అత్యధిక స్కోరు చేసిన ప్లేయర్ గా సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ అభిషేక్ శర్మ నిలిచాడు. ఈ సీజన్లో అభిషేక్ ఒక మ్యాచ్ లో 141 పరుగులు చేశాడు. గుజరాత్ ఆటగాడు ప్రసిద్ధ్ కృష్ణ 25 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా టాప్ లో నిలవగా.. అత్యధిక డాట్ బాల్స్ వేసిన ప్లేయర్ గా సిరాజ్ నిలిచాడు. 151 డాట్ బాల్స్ వేశాడు.






