IPL 2025 : ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌పై నిషేధం విధించిన బీసీసీఐ.. ఎందుకో తెలుసా?

by Harish |

ఇంగ్లాండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌పై వేటు పడింది.

IPL 2025 : ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌పై నిషేధం విధించిన బీసీసీఐ.. ఎందుకో తెలుసా?
X

దిశ, స్సోర్ట్స్ : ఇంగ్లాండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌పై వేటు పడింది. ఐపీఎల్‌ నుంచి తప్పుకున్నందుకు బీసీసీఐ అతన్ని రెండేళ్లపాటు నిషేధించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. మెగా వేలంలో బ్రూక్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ 6.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఇటీవల అతను ఐపీఎల్‌ నుంచి తప్పుకుంటున్నట్టు వెల్లడించాడు. గతేడాది కూడా అతను లీగ్‌కు అందుబాటులో లేడు. ఐపీఎల్ తీసుకొచ్చిన రూల్ ప్రకారం.. వేలంలో ఎంపికైన తర్వాత ఏ ఆటగాడైనా లీగ్‌ నుంచి స్వయంగా తప్పుకుంటే రెండేళ్లపాటు బ్యాన్ విధించొచ్చు. అనారోగ్య కారణాలకు మాత్రమే మినహాయింపు ఉంటుంది. బ్రూక్ గాయపడలేదు. జాతీయ జట్టు బాధ్యతల కారణంగా భారత టీ20 లీగ్ ఆడటం లేదని తెలిపాడు. ఈ క్రమంలోనే బీసీసీఐ చర్యలు చేపట్టింది. ‘బ్రూక్‌ను బీసీసీఐ రెండేళ్లు బ్యాన్ చేసింది. ఈ విషయాన్ని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు, బ్రూక్‌కు తెలియజేశాం. ఇది బోర్డు నిర్ణయించిన విధానం. దీనికి ప్రతి ఒక్క ప్లేయర్ కట్టుబడి ఉండాలి.’ అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. కొత్త రూల్ ప్రకారం.. ఐపీఎల్‌లో నిషేధం ఎదుర్కొన్న తొలి ప్లేయర్ బ్రూక్. బీసీసీఐ వేటుతో బ్రూక్ 2026, 2027 సీజన్‌కు దూరం కానున్నాడు. 2028 సీజన్‌‌కు అందుబాటులోకి రానున్నాడు.


Next Story