ఆర్సీబీ మ్యాచ్ వేదిక మార్చిన బీసీసీఐ.. వర్షం భయంతోనే?

by Phanindra |

ఆర్సీబీ మ్యాచ్ వేదిక మార్చిన బీసీసీఐ. వర్షం భయంతో సన్‌రైజర్స్ మ్యాచ్‌ లక్నోకు మార్పు. ప్లేఆఫ్స్ వేదికలు కూడా మార్చిన నిర్వాహకులు.

ఆర్సీబీ మ్యాచ్ వేదిక మార్చిన బీసీసీఐ.. వర్షం భయంతోనే?
X

దిశ, వెబ్ డెస్క్ : మే 23న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగాల్సిన మ్యాచ్‌ను కూడా లక్నోకు మార్చినట్లు బీసీసీఐ తెలిపింది. ఈ మ్యాచ్ బెంగళూరులో జరగాల్సి ఉంది. కానీ ఇక్కడ కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ వేదికను లక్నోకు మార్చారు. ఇక తమ చివరి లీగ్ మ్యాచ్‌లో మే 27న లక్నోతో ఆర్సీబీ తలపడనుంది. ఈ మ్యాచ్ కూడా ఏకానా స్టేడియంలోనే జరగనుంది.

ప్లేఆఫ్స్ వేదికలు కూడా..

ఐపీఎల్ 2025 ప్లే ఆఫ్స్ కొత్త వేదికలను బీసీసీఐ ప్రకటించింది. పంజాబ్‌లోని ముల్లాన్‌పూర్‌లో తొలి క్వాలిఫైయర్, ఎలిమినేటర్ మ్యాచులు నిర్వహిస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది. మే 29న క్వాలిఫైయర్-1, మే 30న ఎలిమినేటర్ మ్యాచులు జరగనున్నాయి. ఇక క్వాలిఫైయర్-2, ఐపీఎల్ పైనల్ మ్యాచులు గుజరాత్‌లోని నరేంద్రమోడీ స్టేడియంలో నిర్వహించనున్నారు. జూన్ 1న క్వాలిఫైయర్-2, జూన్ 3న ఫైనల్ మ్యాచ్ జరుగుతాయి. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో తీవ్రమైన వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో.. ఈ కీలకమైన మ్యాచులకు వర్షం అంతరాయం కలిగించకూడదనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ వర్గాలు చెప్తున్నాయి.

Next Story