పంజాబ్, ఢిల్లీ మ్యాచ్ మళ్లీ నిర్వహిస్తారా?.. పంజాబ్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ ఏం చెప్పాడంటే?

by Harish |

ఐపీఎల్-2025లో భాగంగా ఈ నెల 8న జరగాల్సిన పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య అర్ధాంతరంగా ఆగిపోయిన విషయం తెలిసిందే.

పంజాబ్, ఢిల్లీ మ్యాచ్ మళ్లీ నిర్వహిస్తారా?.. పంజాబ్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ ఏం చెప్పాడంటే?
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-2025లో భాగంగా ఈ నెల 8న జరగాల్సిన పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య అర్ధాంతరంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితుల కారణంగా మ్యాచ్‌ను మధ్యలోనే నిలిపివేశారు. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ 10.1 ఓవర్లలో ఒక్క వికెట్ కోల్పోయి 122 రన్స్ చేసింది. సాధారణంగా మ్యాచ్ రద్దైతే ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయిస్తారు. కానీ, పాయింట్లు ఇవ్వలేదు. ఈ మ్యాచ్‌‌పై బీసీసీఐ ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ఈ మ్యాచ్ రద్దైయిందా?లేదా?.. తిరిగి నిర్వహిస్తారా? అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పంజాబ్ కింగ్స్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ క్లారిటీ ఇచ్చాడు. పంజాబ్, ఢిల్లీ మ్యాచ్‌ తిరిగి జరుగుతుందని తెలిపాడు. గేమ్ ఆరంభం నుంచి మొదలవుతుందని స్పష్టతనిచ్చాడు. ధర్మశాలలో కాకుండా కొత్త వేదికలో మ్యాచ్ ఉంటుందని చెప్పాడు. ‘అప్పుడు 10 ఓవర్లలో 120 రన్స్ చేశాం. ఒక్క వికెట్ కోల్పోయాం. కానీ, ఈసారి ఒక్క వికెట్ కూడా కోల్పోం.’అని అర్ష్‌దీప్ దీమా వ్యక్తం చేశాడు.


Next Story