- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > IPL 2026 > IPL 2023: ఈ ఏడాదీ ఆ జట్టుదే ఐపీఎల్.. ఏబీ డీ విలియర్స్ ఆసక్తికర కామెంట్స్

X
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023 కప్ ఎవరి వశం అవుతుందనే దానిపై అభిమానుల్లో భిన్న అంచనాలు నెలకొన్నాయి. అయితే దీనిపై ఆర్సీబీ జట్టు మాజీ ప్లేయర్ ఏబీ డీ విలియర్స్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఐపీఎల్ 2023 సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. ఈ సీజన్‌లోనూ గుజరాత్ టైటాన్స్ జట్టు బలంగా కనిపిస్తోంది. గతేడాదే కొత్తగా అవతరించిన గుజరాత్ టైటాన్స్.. తొలి ఏడాదే కప్పును ఎగరేసుకుపోయింది.
‘‘చాలా కాలం క్రితం ఐపీఎల్ వేలం సమయంలోనే గుజరాత్ జట్టు విజేతగా నిలుస్తుందని చెప్పా. ఆర్సీబీ గెలవాలని నాకు ఉన్నప్పటికీ, గతంలో చెప్పిన దానికే నేను కట్టుబడి ఉంటా. ఆ జట్టు (గుజరాత్) గొప్పది. ఎంతో సమతూకంతో ఉంది. వారి దగ్గర కావాల్సినన్ని సామర్థ్యాలు ఉన్నాయి’’ అని డీ విలియర్స్ అన్నాడు.
Next Story






