కీలక మ్యాచ్ లో హిట్ మ్యాన్ హాఫ్ సెంచరీ

by Dishafeatures2 |
కీలక మ్యాచ్ లో హిట్ మ్యాన్ హాఫ్ సెంచరీ
X

దిశ, వెబ్ డెస్క్: సొంత గ్రౌండ్ వాంఖడే స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన కీలక మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ చేశాడు. 201 పరుగుల లక్ష్యంతో క్రీజులోకి వచ్చిన ముంబై ఓపెనర్లు ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ దూకుడుగానే ఇన్నింగ్స్ ను ఆరంభించారు. అయితే మూడో ఓవర్లో వ్యక్తిగత స్కోర్ 14 వద్ద ఇషాన్ కిషన్ క్యాచ్ అవుటయ్యాడు. ఈ క్రమంలోనే క్రీజులోకి వచ్చి గ్రీన్ తో కలిసి హిట్ మ్యాన్ స్కోర్ ను పరుగులు పెట్టించాడు. ఈ నేపథ్యంలోనే 32 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి జట్టు స్కోరును ముందుకు ఉరికించాడు. ఇక రోహిత్ శర్మకు గ్రీన్ రూపంలో మంచి పార్ట్నర్ దొరికాడు. గ్రీన్ కూడా హాఫ్ సెంచరీ చేశాడు.

ఇక ఈ మ్యాచ్ లో గెలిచి ప్లే ఆఫ్ కు పోవాలనే గట్టి పట్టుదలతో రోహిత్ సేన ఉంది. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్, చెన్నయ్ సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ప్లే ఆఫ్ కు చేరుకున్నాయి. ఇక నాలుగో ప్లేస్ కోసం ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ పోటీ పడుతున్నాయి. కాగా ఆర్సీబీ ఇవాళ సాయంత్రం చెన్నయ్ లోని చెపాక్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ తో తలపడనుంది.


Next Story

Most Viewed