చావో రేవో మ్యాచ్లో రోహిత్ సేన ఘన విజయం

by Dishafeatures2 |
చావో రేవో మ్యాచ్లో రోహిత్ సేన ఘన విజయం
X

దిశ, వెబ్ డెస్క్: ప్లే ఆఫ్ అవకాశాలను ముంబై ఇండియన్స్ జట్టు సజీవంగా ఉంచుకుంది. ఆదివారం సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన కీలక మ్యాచ్ లో 201 పరుగుల లక్ష్యాన్ని 2 ఓవర్లు మిగిలి ఉండగానే చేరుకుంది. తొలుత టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ టీమ్ 200 రన్స్ చేసి ముంబై ముందు భారీ టార్గెట్ ను పెట్టింది. అయితే 201 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి జట్టు స్కోర్ 20 వద్ద ఓపెనర్ ఇషాన్ కిషన్ అవుటవ్వడంతో గట్టి దెబ్బ తగిలింది. అయితే మరో ఓపెనర్ రోహిత్ శర్మ తర్వాత వచ్చిన గ్రీన్ తో కలిసి స్కోరును పరుగులు పెట్టించాడు. 37 బాల్స్ లో 56 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. దగర్ బౌలింగ్ లో క్యాచ్ అవుటయ్యాడు. అయితే గ్రీన్ 47 పరుగుల్లోనే 100 రన్స్ చేసి జట్టు స్కోరును పరుగులు పెట్టించాడు. చివర్లో సూర్యకుమార్ యాదవ్ (25)తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

ఇక తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ జట్టులో మయాంక్ అగర్వాల్ 83, వివ్రాంత్ శర్మ 69తో రాణించారు. ఇక ముంబై ఇండియన్స్ బౌలర్లలో ఆకాశ్ మద్వాల్ 4 వికెట్లు తీయగా.. ఎస్ఆర్హెచ్ నుంచి భువీ, మయాంక్ దగర్ చెరో వికెట్ తీశారు. 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ముంబై.. ఇవాళ జరిగే రెండో మ్యాచ్ లో గుజరాత్ చేతిలో ఆర్సీబీ ఓడితే నేరుగా ప్లే ఆఫ్ కు చేరుకుంటుంది. ఒకవేళ ఆర్సీబీ గెలిస్తే నెట్ రన్ రేట్ ఏ ఎవరికి ఎక్కువ ఉంటే ఆ జట్టు ప్లే ఆఫ్ కు చేరుకుంటుంది.



Next Story