- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉనద్కత్ స్థానంలో సూర్యాన్ష్
by Javid Pasha |
లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయర్ జయదేశ్ ఉనద్కత్ స్థానాన్నిసూర్యాన్ష్ షెడ్గే భర్తీ చేశారు.

X
లక్నో : లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ పేసర్ జయదేశ్ ఉనద్కత్ గాయం కారణంగా ఐపీఎల్-16 నుంచి మధ్యలో వైదొలిగిన విషయం తెలిసిందే. అతని రిప్లేస్‌మెంట్‌ను లక్నో ఫ్రాంచైజీ తాజాగా ప్రకటించింది. ఉనద్కత్ స్థానాన్ని ముంబై ఆల్‌రౌండర్ సూర్యాన్ష్ షెడ్గేతో భర్తీ చేసినట్టు శుక్రవారం ట్విట్టర్ వేదికగా తెలిపింది. రూ. 20 లక్షలకు సూర్యాన్ష్‌ను జట్టులోకి తీసుకుంది. ముంబైకి చెందిన సూర్యాన్ష్ గత రంజీ ట్రోఫీలో ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అలాగే, అండర్-26 స్టేట్ ఏ ట్రోఫీలో అతను 8 మ్యాచ్‌ల్లో 184 పరుగులతోపాటు 12 వికెట్లు తీశాడు. కాగా, లక్నో చివరి లీగ్ మ్యాచ్‌లో నేడు కోల్‌కతాతో తలపడనుంది. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్‌లో మూడో స్థానంలో ఉన్న లక్నో ఈ మ్యాచ్‌లో గెలిస్తే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది.
Next Story






