- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17లో లక్నో సూపర్ జెయింట్స్ జోరు కొనసాగుతోంది. లక్నో వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌పై 33 పరుగుల తేడాతో నెగ్గింది. దీంతో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత ఓవర్లలో 163/5 స్కోరు చేసింది. స్టోయినిస్(58) హాఫ్ సెంచరీతో సత్తాచాటగా.. కెప్టెన్ కేఎల్ రాహుల్(33), పూరన్(32 నాటౌట్) విలువైన పరుగులు జోడించారు. అనంతరం మోస్తరు లక్ష్య ఛేదనలో గుజరాత్ తేలిపోయింది. 18.5 ఓవర్లలో 130 పరుగులకే ఆలౌటైంది. సాయి సుదర్శన్(31) టాప్ స్కోరర్. యశ్ ఠాకూర్(5/30) పేస్ ధాటికి ఆ జట్టు బ్యాటర్లు క్రీజులో నిలువలేకపోయారు. అతనికితోడు కృనాల్ పాండ్యా(3/11) మెరవడంతో గుజరాత్ కనీసం పోటీ ఇవ్వలేకపోయింది. ఈ విజయంతో లక్నో పాయింట్స్ టేబుల్‌లో 3వ స్థానానికి చేరుకుంది.
Next Story






