IPL 2023: నవీన్ ఉల్ హక్‌పై కోహ్లీ ఫ్యాన్స్ రివేంజ్.. ఎలిమినేటర్ మ్యాచ్‌లో నినాదాలు

by Disha Web Desk 13 |
IPL 2023: నవీన్ ఉల్ హక్‌పై కోహ్లీ ఫ్యాన్స్ రివేంజ్.. ఎలిమినేటర్ మ్యాచ్‌లో నినాదాలు
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో ఎలిమినేటర్ మ్యాచ్‌‌లో ముంబయి చేతిలో చిత్తుగా ఓడిన లక్నో.. మరోసారి ట్రోఫీ గెలవకుండానే నిష్క్రమించింది. అయితే ఈ మ్యాచ్‌లో నవీన్ ఉల్ హక్ కన్పించిన ప్రతీసారి కోహ్లీ, కోహ్లీ అని నినాదాలు చేశారు కోహ్లీ ఫ్యాన్స్. లక్నో మ్యాచు ఓడిపోయిన తర్వాత స్వీట్ మ్యాంగోస్ అంటూ నెటిజన్లు పోస్టులు పెట్టారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచుల్లో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. విరాట్ కోహ్లీ వర్సెస్ గంభీర్, నవీన్ ఉల్ హక్ మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగింది. ఈ ఘటనను విరాట్ కోహ్లీ మర్చిపోయినా.. అతడి ఫ్యాన్స్ మాత్రం మర్చిపోవడం లేదు. అవకాశం వచ్చిన ప్రతీసారి లక్నో టీం మెంటార్ గౌతమ్ గంభీర్, పేసర్ నవీన్ ఉల్ హక్‌ను టీజ్ చేస్తున్నారు. మ్యాచు ఎక్కడైనా సరే.. లక్నో ఆడిందంటే చాలు అక్కడికి వెళ్లి కోహ్లీ.. కోహ్లీ అని నినాదాలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ముంబయి ఇండియన్స్‌తో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచులోనూ నవీన్ ఉల్ హక్‌కు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ సెగ తగలింది. నవీన్ ఉల్ హక్కు బౌలింగ్ చేసినా, ఫీల్డింగ్ చేసినా.. అభిమానులు మాత్రం కోహ్లీ కోహ్లీ అనే అరుస్తూ గోలగోల చేశారు. ఆర్సీబీ ఓడిపోయినప్పుడు, విరాట్ కోహ్లీ ఔటయినపుడు.. నవీన్ ఉల్ హక్ ఇన్‌స్టాలో పెట్టిన స్టోరీస్ గుర్తుపెట్టుకున్నారో ఏమోగానీ.. మ్యాచు మొత్తం అదే జోరు కొనసాగించారు కోహ్లీ ఫ్యాన్స్. మైదానంలో ఉన్న కోహ్లీ ఫ్యాన్సే కాకుండా.. బయట ఉన్న అభిమానులు సైతం వ్యంగ్యాస్త్రాలు సంధించారు. స్వీట్ మ్యాంగోస్ అంటూ గంభీర్, నవీన్ ఉల్ హక్‌ ఫోటోలను జోడిస్తూ పోస్టులు పెట్టారు.

Next Story

Most Viewed