IPL 2023: సిరాజ్ ఇంట్లో ఆర్సీబీ టీమ్ సందడి.. (వీడియో)

by Disha Web Desk 13 |
IPL 2023: సిరాజ్ ఇంట్లో ఆర్సీబీ టీమ్ సందడి.. (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తమ తదుపరి మ్యాచ్ (మే 18న ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో) కోసం హైదరాబాద్‌కు చేరుకుంది. ఈ నేపథ్యంలో లోకల్ ప్లేయర్, ఆర్‌సీబీ స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్.. తన టీమ్‌కు ఆతిథ్యం ఇచ్చాడు. కొత్తగా నిర్మించిన తన ఇంటికి ఆర్‌సీబీ టీమ్ మొత్తాన్ని డిన్నర్‌కు ఆహ్వానించాడు. విరాట్ కోహ్లీ, ఫాప్ డుప్లెసిస్, గ్లేన్ మ్యాక్స్‌వెల్‌తో సహా పలువురు ఆర్‌సీబీ ప్లేయర్లు, సపోర్టింగ్ స్టాఫ్ సిరాజ్ ఇంటి వద్ద సందడి చేశారు. సిరాజ్ ఆతిథ్యాన్ని స్వీకరించారు. హైదరాబాద్ ఫుడ్‌ను ఆస్వాదించారు. మహమ్మద్ సిరాజ్ తన నూతన నివాసాన్ని ఫిల్మ్ నగర్‌లో నిర్మించుకున్నట్లు తెలుస్తోంది.

సిరాజ్ ఇంటివద్ద ఆర్‌సీబీ ఆటగాళ్ల సందడిని వీడియో తీసిన ఓ అభిమాని సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో వైరల్‌గా మారింది. ఈ సీజన్‌లో హైదరబాదీ పేసర్ సిరాజ్.. అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. పవర్ ప్లేలో వికెట్లు తీస్తూ ఆర్‌సీబీకి శుభారంభాన్ని అందిస్తున్నాడు. ఇప్పటివరకు ఈ సీజన్‌‌లో సిరాజ్ 12 మ్యాచుల్లో 16 వికెట్ల పడగొట్టాడు.



Next Story

Most Viewed