IPL 2023: ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ చెత్త రికార్డు.. ఆ జాబితాలో రెండో స్థానం

by Disha Web Desk 13 |
IPL 2023: ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ చెత్త రికార్డు.. ఆ జాబితాలో రెండో స్థానం
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి దారుణంగా విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ (0) గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. రాజస్తాన్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ స్వింగ్‌కు వికెట్లు ముందు దొరికిపోయాడు. ఈ క్రమంలో కోహ్లి ఐపీఎల్‌లో ఒక చెత్త రికార్డు నమోదు చేశాడు. ఐపీఎల్‌లో అత్యధిక సార్లు గోల్డెన్‌ డకౌట్‌ అయిన జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. కోహ్లీ ఏడుసార్లు గోల్డెన్‌డక్‌గా వెనుదిరగ్గా.. సునీల్‌ నరైన్‌, హర్బజన్‌ సింగ్‌లతో కలిసి కోహ్లి సమానంగా ఉన్నారు. ఇక తొలి స్థానంలో గుజరాత్‌ టైటాన్స్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ 10 గోల్డెన్‌ డకౌట్లతో తొలి స్థానంలో ఉన్నాడు.

Next Story