- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, వెబ్‌డెస్క్: పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో మూడో అత్యధిక ఫిఫ్టీ ప్లస్ స్కోర్ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్ధశతకంతో ఈ ఘనత సాధించాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఐపీఎల్ 8వ లీగ్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 5 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ధావన్ 56 బంతుల్లో 86 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు.
ఐపీఎల్‌లో అత్యధిక అర్ధశతకాలు సాధించిన మూడో బ్యాటర్‌గా నిలిచాడు. ధావన్ 50 అర్ధశతకాలు నమోదు చేసి ఎలైట్ క్లబ్‌లో చేరాడు. డేవిడ్ వార్నర్(60), విరాట్ కోహ్లీ(50) అతడి కంటే ముందున్నారు. అంతేకాకుండా ఐపీఎల్‌లో అత్యధిక అర్ధ సెంచరీలు సాధించిన రెండో భారత బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు.
Next Story






