IPL 2023: ఐపీఎల్‌లో మరో రీప్లేస్‌మెంట్..

by Disha Web Desk 13 |
IPL 2023: ఐపీఎల్‌లో మరో రీప్లేస్‌మెంట్..
X

దిశ, వెబ్‌డెస్క్: ఎంతో రసవత్తరంగా సాగుతోన్న ఐపీఎల్‌లో అదే స్థాయిలో గాయాలు వేధిస్తోన్నాయి. ప్లేయర్‌ల రీప్లేస్‌మెంట్స్ లిస్ట్ పెరుగుతూనే ఉంది. దాదాపు అన్ని జట్లల్లోనూ గాయాల బారిన పడ్డ ప్లేయర్లు ఉన్నారు. వారిని రీప్లేస్ చేయడానికి ఆయా ఫ్రాంఛైజీల మేనేజ్‌మెంట్లన్నీ కొత్త ముఖాలను వెదుక్కుంటోన్నాయి. ఇప్పటివరకు 14 మంది డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ప్లేయర్లు గాయపడ్డారు. వారి స్థానాల్లో కొత్త వారిని తీసుకుంటోన్నాయి ఫ్రాంఛైజీలు. ఇదే లిస్ట్‌లో తాజాగా మరో ప్లేయర్ చేరాడు. గుజరాత్ టైటాన్స్‌లో కేన్ విలియమ్సన్ స్థానాన్ని భర్తీ చేసిందా జట్టు ఫ్రాంచైజీ. శ్రీలంక కెప్టెన్ డాసన్ శనకను జట్టులోకి తీసుకుంది.

తాజాగా పంజాబ్ కింగ్స్ అన్ క్యాప్డ్ ప్లేయర్ రాజ్ అంగద్ బావను రీప్లేస్ చేసిందా జట్టు. ఫస్ట్ క్లాస్ క్రికెటర్ గుర్నూర్ సింగ్ బ్రార్‌ను జట్టులోకి తీసుకుంది. గత ఏడాదే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అడుగుపెట్టాడు గుర్నూర్. అయిదు మ్యాచ్‌లు ఆడాడు. పంజాబ్ తరఫున ఆడుతున్నాడీ లెఫ్ట్ హ్యాండర్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్. ఈ అయిదు మ్యాచ్‌లల్లో 120.22 స్ట్రైక్ రేట్‌తో 107 పరుగులు చేశాడు. 3.80 ఎకానమీతో ఏడు వికెట్లను పడగొట్టాడు. 20 లక్షల రూపాయలకు అతనితో కాంటాక్ట్ కుదుర్చుకుంది పంజాబ్ కింగ్స్ మేనేజ్‌మెంట్.


Next Story

Most Viewed