IPL 2023: ఐపీఎల్‌కు గ్లామర్‌ టచ్‌.. డ్యాన్స్‌తో అదరగొట్టనున్నరష్మిక, తమన్నా.. రిహార్సల్స్‌ (వీడియో)

by Disha Web Desk 13 |
IPL 2023: ఐపీఎల్‌కు గ్లామర్‌ టచ్‌.. డ్యాన్స్‌తో అదరగొట్టనున్నరష్మిక, తమన్నా.. రిహార్సల్స్‌ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీ కోసం రష్మిక, తమన్నా, అరిజిత్ సింగ్ రిహార్సల్స్‌లో పాల్గొన్నారు. దీనిపై స్పందించిన రష్మిక మందన్నా.. తన జీవితంలో ఎప్పుడూ ఓ క్రికెట్ లైవ్ మ్యాచ్ లైవ్ చూడలేకపోయానని.. కానీ ఇప్పుడు ఐపీఎల్ లాంటి మెగా ఈవెంట్‌లో లైవ్ పర్ఫార్మెన్స్ చేయబోతుండటం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇక రష్మిక తన ఫేవరెట్ క్రికెటర్ల గురించి చెప్పింది. ధోనీ సర్, విరాట్ సర్ అంటూ ఆమె చెప్పడం విశేషం. ఓపెనింగ్ సెర్మనీ కోసం తమన్నాతో కలిసి ఆమె రిహార్సల్స్ చేస్తోంది. ‘అర్జిత్‌ సింగ్‌, రష్మక మందన్నా లతో కలిసి వేదిక పంచుకోవడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని తమన్నా చెప్పుకొచ్చింది.

ఈ సెర్మనీకి ముందు వాళ్లు ఇలా ఫీలవుతున్నారంటూ ఐపీఎల్ అధికారిక ట్విటర్ అకౌంట్ ఓ వీడియోను పోస్ట్ చేసింది. అందులో తమన్నా, రష్మిక తమ ఎక్సైట్‌మెంట్‌ను అభిమానులతో షేర్ చేసుకున్నారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో వీళ్లు లైవ్‌లో పర్ఫార్మ్ చేయబోతున్నారు. శుక్రవారం (మార్చి 31) ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు ఓపెనింగ్ సెర్మనీ ఉంటుంది. ఈసారి మొత్తం 12 వేదికల్లో 74 మ్యాచ్‌లు జరగనున్నాయి. హైదరాబాద్‌తోపాటు ముంబై, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా, లక్నో, జైపూర్, గువాహటి, ధర్మశాల, మొహాలీలలో మ్యాచ్‌లు జరుగనున్నాయి.



Next Story

Most Viewed