IPL 2023: చెలరేగుతున్న షమీ.. ఐదో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్

by Disha Web Desk 13 |
IPL 2023: చెలరేగుతున్న షమీ.. ఐదో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ బౌలర్‌ మహ్మద్‌ షమీ బౌలింగ్‌లో చెలరేగుతున్నాడు. మూడు ఓవర్లు బౌలింగ్‌ వేసిన షమీ ఏడు పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీయడంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ 23 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. షమీ వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ తొలి బంతికే ఫిల్‌ సాల్డ్‌ గోల్డెన్‌ డకౌట్‌ కాగా.. హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌లో వార్నర్‌ రనౌట్‌గా వెనుదిరిగాడు.

అనంతరం షమీ బౌలింగ్‌లో రిలీ రొసౌ(8) సాహాకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. తాజాగా 10 పరుగులు చేసిన ప్రియమ్‌ గార్గ్‌ షమీ బౌలింగ్‌లో సాహాకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 9 ఓవర్‌లో 5 వికెట్లు కోల్పోయి 44 రన్స్ చేసింది. అక్షర్ పటేల్ (9), అమన్ ఖాన్ (12) పరుగులతో క్రీజులో ఉన్నారు.



Next Story

Most Viewed