IPL 2023: ఆర్‌సీబీకి 'డూ ఆర్‌ డై' మ్యాచ్.. సన్‌రైజర్స్‌తో బిగ్ ఫైట్

by Disha Web Desk 13 |
IPL 2023: ఆర్‌సీబీకి డూ ఆర్‌ డై మ్యాచ్.. సన్‌రైజర్స్‌తో బిగ్ ఫైట్
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న సన్‌రైజర్స్ విజయాలతో ఈ సీజన్‌ను మెరుగ్గా ముగించాలనుకుంటోంది. మరోవైపు ఆర్‌సీబీకి ఇది డూఆర్‌డై మ్యాచ్. ప్లే ఆఫ్స్ చేరాలంటే ఈ మ్యాచ్‌ తప్పకుండా గెలవాలి. ఓడితే మాత్రం ఇంటిదారి పట్టాల్సిందే. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో సంచలన ప్రదర్శన కనబర్చిన ఆర్‌సీబీ 112 పరుగుల భారీ తేడాతో గెలిచి అనూహ్యంగా ప్లే ఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది. ఇదే జోరులో సన్‌రైజర్స్‌ను చిత్తు చేసి ప్లే ఆఫ్స్ అవకాశాలను మెరుగుపరుచుకోవాలనుకుంటోంది. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ తుదిజట్టు(అంచనా):

అన్మోల్‌ప్రీత్ సింగ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మర్క్రమ్ (సి), హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, ఫజల్హాక్ ఫరూఖీ

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుదిజట్టు(అంచనా):

విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (సి), అనుజ్ రావత్, గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్ (WK), మైకేల్ బ్రేస్‌వెల్, వేన్ పార్నెల్, కర్ణ్ శర్మ, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్


Next Story