IPL 2023: ఐపీఎల్‌లో నేడు మరో ఆసక్తికర ఫైట్.. చెన్నైతో ఢిల్లీ క్యాపిటల్స్ ఢీ..

by Disha Web Desk 13 |
IPL 2023: ఐపీఎల్‌లో నేడు మరో ఆసక్తికర ఫైట్.. చెన్నైతో ఢిల్లీ క్యాపిటల్స్ ఢీ..
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా చెన్నైలోని చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. వరుసగా రెండు పరాజయాల తర్వాత ముంబై ఇండియన్స్‌పై అద్భుత విజయాన్నందుకున్న చెన్నై.. 6 విజయాలతో పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానంలో కొనసాగుతోంది. అయితే ప్లే ఆఫ్స్ చేరాలంటే చెన్నై చివరి మూడు మ్యాచ్‌ల్లో రెండింటిలో గెలవాలి. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఎలాగైనా ఓడించాలని ఆ జట్టు భావిస్తోంది. మరోవైపు వరుస పరాజయాల తర్వాత పుంజుకున్న ఢిల్లీ 4 విజయాలతో పాయింట్స్ టేబుల్‌లో ఆఖరి స్థానంలో నిలిచింది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే అంటే ఆ జట్టు ప్రతీ మ్యాచ్ గెలవాల్సిందే. దాంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు(అంచనా):

డేవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే, అంబటి రాయుడు, శివమ్ ధూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీ, దీపక్ చాహర్, మహీశ్ తీక్షణ, మహీశ్ పతీరణ

ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు(అంచనా):

డేవిడ్ వార్నర్ (c), ఫిలిప్ సాల్ట్ (WK), మిచెల్ మార్ష్, రిలీ రోసోవ్, మనీష్ పాండే, అమన్ హకీమ్ ఖాన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్

Next Story

Most Viewed