IPL 2023: ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్.. స్వదేశానికి ఆల్‌‌రౌండర్

by Disha Web Desk 13 |
IPL 2023: ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్.. స్వదేశానికి ఆల్‌‌రౌండర్
X

న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్‌‌రౌండర్ మిచెల్ మార్ష్‌ పలు మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. నేడు రాజస్థాన్‌తో జరిగే మ్యాచ్‌కు కూడా అతడు అందుబాటులో ఉండటం లేదు. ఈ విషయాన్ని ఢిల్లీ జట్టు బౌలింగ్ కోచ్ జేమ్స్ హోప్స్ వెల్లడించాడు. ‘మార్ష్ పెళ్లి చేసుకోబోతున్నాడు. అతను ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్తున్నాడు.

దాంతో పలు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడు’ అని తెలిపాడు. కాగా, ఐపీఎల్‌లో గత రెండు మ్యాచ్‌ల్లో ఢిల్లీ జట్టు ఓడిపోయిన విషయం తెలిసిందే. రెండు మ్యాచ్‌ల్లోనూ మిచెల్ మార్ష్ దారుణంగా విఫలమయ్యాడు. లక్నోతో జరిగిన ఓపెనింగ్ మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగిన అతను.. గుజరాత్‌పై 4 పరుగులు మాత్రమే చేసి షమీ బౌలింగ్‌లో అవుటయ్యాడు.



Next Story

Most Viewed