IPL 2023: చెన్నైకు బిగ్ షాక్.. స్టార్ పేసర్‌కు గాయం..

by Disha Web Desk 13 |
IPL 2023: చెన్నైకు బిగ్ షాక్.. స్టార్ పేసర్‌కు గాయం..
X

చెన్నయ్: చెన్నయ్ సూపర్ కింగ్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. శనివారం ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు స్టార్ పేసర్ దీపక్ చాహర్ గాయపడ్డాడు. ముంబై ఇన్నింగ్స్‌లో తొలి ఓవర్ వేసిన చాహర్ ఐదో బంతి వేసిన తర్వాత తొడకండరాల గాయంతో ఇబ్బంది పడ్డాడు. ఫిజియో వచ్చి ఫీల్డ్ ట్రీట్‌మెంట్ అందించాడు. అయితే, ఆ ఓవర్‌లో చివరి బంతిని వేసిన తర్వాత చాహర్ మైదానం వీడాడు.

చాహర్ గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. దాంతో అతను లీగ్‌లో పలు మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది. గతేడాది తొడకండరాల గాయంతోనే లీగ్‌కు దూరమైన చాహర్.. ఈసారి తనదైన ముద్ర వేస్తాడని జట్టు భావించింది. అయితే, గత రెండు మ్యాచ్‌ల్లోనూ తన స్థాయి ప్రదర్శన చేయలేకపోయాడు. ఒక్క వికెట్ కూడా తీయకపోగా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు.



Next Story

Most Viewed