భీకర ఫామ్లో కోహ్లీ.. మరో ఫిఫ్టీ కొట్టిన కింగ్

by Dishafeatures2 |
భీకర ఫామ్లో కోహ్లీ.. మరో ఫిఫ్టీ కొట్టిన కింగ్
X

దిశ, వెబ్ డెస్క్: కింగ్ కోహ్లీ భీకర ఫామ్ లో ఉన్నాడు. గత మ్యాచ్ లో (మే 19న) సన్ రైజర్స్ హైదరాబాద్ పై సెంచరీ చేసిన ఆర్సీబీ స్టార్ బ్యాటర్.. ఆదివారం గుజరాత్ తో జరుగుతున్న మ్యాచ్ లో 35 బంతుల్లోనే ఫిఫ్టీ సాధించాడు. అందులో 7 ఫోర్లు ఉన్నాయి. కాగా ఐపీఎల్ కోహ్లీకి ఇది 51వ హాఫ్ సెంచరీ. ఇకపోతే ఆర్సీబీకి ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్ లో కచ్చితంగా గెలవాలి. ఇప్పటికే గుజరాత్, చెన్నయ్, లక్నో జట్లు ప్లే ఆఫ్ కు చేరుకున్నాయి.

ఇక నాలుగో బెర్త్ కోసం ముంబై, బెంగళూరు జట్లు పోటీ పడుతున్నాయి. ఇవాళ మధ్యాహ్నం సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక ఆర్సీబీ కూడా గుజరాత్ టైటాన్స్ పై విజయం సాధిస్తే.. ఈ రెండు జట్లలో నెట్ రన్ రేట్ ఎవరికి ఎక్కువగా ఉంటే ఆ జట్టు ప్లే ఆఫ్ కు చేరుకుంటుంది.

Next Story

Most Viewed