- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐపీఎల్ విజేతగా నిలిచిన జట్టుకు భారీ ప్రైజ్ మనీ.. ఎంత దక్కుతుందో తెలుసా?
మరి కాసేపట్లో హైదరాబాద్, కోల్‌కతా జట్ల మధ్య ఐపీఎల్ ఫైనల్ జరగనుంది.

దిశ, స్పోర్ట్స్ : మరి కాసేపట్లో హైదరాబాద్, కోల్‌కతా జట్ల మధ్య ఐపీఎల్ ఫైనల్ జరగనుంది. ఏ జట్టు విజేతగా నిలుస్తుందోనని అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. తమ అభిమాన జట్టే గెలుస్తుందని ఇరు జట్ల ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. అదే సమయంలో గెలిచిన జట్టుకు ఎంత ప్రైజ్‌మనీ దక్కుతుందన్న చర్చ జరుగుతుంది. మరి, ఐపీఎల్-17 మొత్తం ప్రైజ్ మనీ ఎంత?. విజేతకు ఎంత దక్కుతుంది? అనేది తెలుసుకుందాం..
ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్‌కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2008లో మొదలైన ఈ లీగ్ అంచెలంచెలుగా ఎదిగింది. ప్రతి సీజన్‌కు అభిమానగణాన్ని పెంచుకుంటూ వస్తోంది. అదే సమయంలో లీగ్ ప్రైజ్‌మనీ కూడా భారీగానే పెరిగింది. 2008లో విజేత జట్టు రూ.4.8 కోట్లు గెలుచుకుంది. మరి, ఈ సీజన్‌లో లీగ్ ప్రైజ్ మనీ ఎంతో తెలుసా.. ఐపీఎల్-17 మొత్తం ప్రైజ్‌మనీ రూ.46.5 కోట్లు. అందులో విజేత జట్టు రూ. 20 కోట్లు దక్కించుకుంటుంది. హైదరాబాద్, కోల్‌కతా జట్లలో టైటిల్‌తోపాటు ఈ భారీ మొత్తాన్ని సొంతం చేసుకునేదే ఎవరో చూడాలి. రన్నరప్ జట్టుకు రూ. 13 కోట్లు అందుతాయి. మూడో స్థానంలో నిలిచిన రాజస్థాన్ రాయల్స్ రూ. 7 కోట్లు, నాలుగో స్థానంలో నిలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రూ. 6.5 కోట్లు పొందుతాయి.






