టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్

by Dishafeatures2 |
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్
X

దిశ, వెబ్ డెస్క్: టాటా ఐపీఎల్ 2023లో భాగంగా డిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇక అంతకు ముందు ఈ సీజన్ లో సీఎస్కేతో మొదటి మ్యాచ్ ఆడిన పాండ్యా సేన.. సీఎస్కేన చిత్తుగా ఓడించింది. ఇప్పుడు అదే ఊపులో ఢిల్లీ క్యాపిటల్స్ ను ఓడించడానికి సిద్ధమైంది. ఇక విషయానికొస్తే లక్నో సూపర్ జెయింట్స్ తో ఆడిన మొదటి మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోయింది. ఈ నేపథ్యంలో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో డేవిడ్ వార్నర్ సేన బరిలోకి దిగునుంది. కాగా ఈ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతోంది.

ఇక జట్ల విషయానికొస్తే..

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): పృథ్వీ షా, డేవిడ్ వార్నర్ (సి), మిచెల్ మార్ష్, రిలీ రోసౌ, సర్ఫరాజ్ ఖాన్ (w), అక్షర్ పటేల్, అభిషేక్ పోరెల్, కుల్దీప్ యాదవ్, చేతన్ సకారియా, ఖలీల్ అహ్మద్, అన్రిచ్ నోర్ట్జే

గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(w), శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా(c), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, జాషువా లిటిల్, యశ్ దయాల్, అల్జారీ జోసెఫ్

Next Story

Most Viewed