TATA IPL 2023: ముగిసిన గుజరాత్ బ్యాటింగ్.. లక్నో టార్గెట్ 136

by Javid Pasha |

యూపీ రాజధాని లక్నోలో జరుగుతున్న మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ పై గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది.

TATA IPL 2023: ముగిసిన గుజరాత్ బ్యాటింగ్.. లక్నో టార్గెట్ 136
X

దిశ, వెబ్ డెస్క్: యూపీ రాజధాని లక్నోలో జరుగుతున్న మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ పై గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. గుజరాత్ తరఫున కెప్టెన్ హార్దిక్ పాండ్యా బాధ్యతాయుతమైన బ్యాటింగ్ చేసి జట్టును అదుకున్నాడు. 50 బంతుల్లో 66 పరుగులు చేసి జీటీకి గౌరవప్రదమైన స్కోర్ ను అందించాడు. ఇక అంతకు ముందు సాహా 47 రన్స్ చేసి మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. గిల్ డకౌట్ కాగా.. మనోహర్ 3, విజయ్ శంకర్ 10, డేవిడ్ మిల్లర్ 6 పరుగులు మాత్రమై చేసి ఔటయ్యారు.

ఇక లక్నో తరఫున క్రునాల్ పాండ్యా, స్టోయిన్స్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. నవీన్ ఉల్ హక్, అమత్ మిశ్రా ఒక్కో వికెట్ తీశారు. కాగా లక్నో గెలవాలంటే 136 పరుగులు చేయాల్సి ఉంది. ఇక పాయింట్ల పట్టికలో లక్నో సూపర్ జెయింట్స్ రెండో స్థానంలో ఉండగా.. గుజరాత్ టైటాన్స్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. మొదటి స్థానంలో రాజస్థాన్ రాయల్స్ కొనసాగుతోంది.

Next Story