చెన్నై ప్లేయింగ్ 11 జట్టులో బుమ్రా.. షాక్ తిన్న ముంబై

by Disha Web Desk 12 |
చెన్నై ప్లేయింగ్ 11 జట్టులో బుమ్రా.. షాక్ తిన్న ముంబై
X

దిశ, వెబ్‌డెస్క్: గాయం కారణంగా ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి దూరం అయిన ముంబై బౌలర్ బుమ్రా చెన్నై ప్లేయింగ్ 11 జట్టులో దర్శనమిచ్చాడు. దీంతో ఒక్కసారిగా అంతా షాక్‌కు గురయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. CSK తరఫున సౌత్ ఆఫ్రికా బౌలర్ సిసంద మగలా అరంగేట్రం చేశాడు. కాగా జియో సినిమా ప్లాట్ ఫామ్ మాత్రం మగలా స్థానంలో జస్ప్రీత్ బుమ్రా ఫోటోను ప్లే చేశారు. అది కూడా.. టాస్ అనంతరం జట్ల ప్లేయింగ్ XI జట్టు లిస్టులో బుమ్రా ఫొటోను చూపారు.

అయితే ఇది గమనించిన బుమ్రా ఫ్యాన్స్ స్క్రీన్ షాట్ తీసుకుని.. "బుమ్రా ఎట్టకేలకు తిరిగి వచ్చాడు" అని ట్వీట్ చేశారు. అలాగే మరో అభిమాని.. "బుమ్రా CSK కోసం ఎందుకు ఆడుతున్నారు?" ‘డబుల్ ఇంపాక్ట్ ప్లేయర్ బుమ్రా ఇన్ ఫర్ మగాలా’ అని మరో అభిమాని ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. కాగా ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.

Next Story