IPL 2023: ప్లేఆఫ్ మ్యాచ్‌‌లో 292 డాట్‌బాల్స్‌.. లక్షకుపైగా మొక్కలు

by Disha Web Desk 13 |
IPL 2023: ప్లేఆఫ్ మ్యాచ్‌‌లో 292 డాట్‌బాల్స్‌.. లక్షకుపైగా మొక్కలు
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023 భాగంగా ప్లేఆఫ్ మ్యాచ్‌ల ప్రారంభానికి ముందు స్పాన్సర్‌ టాటాతో కలిసి బీసీసీఐ సరికొత్త కార్యచరణ రూపొందించిన విషయం తెలిసిందే. ప్లేఆఫ్‌ మ్యాచ్‌ల్లో నయోదయ్యే ప్రతీ డాట్‌బాల్‌కు 500 మొక్కలు నాటే ప్రోగ్రామ్‌కి శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో ప్లేఆఫ్‌ మ్యాచ్‌ల సమయంలో డాట్ బాల్ స్థానంలో గ్రీన్ ట్రీ ఫొటోను గ్రాఫిక్‌గా ఉపయోగించారు. దీంతో ప్లేఆఫ్స్ దశలో ఆడిన మొత్తం నాలుగు మ్యాచ్‌ల్లో నమోదైన డాట్‌బాల్స్‌.. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో మొత్తం 84 డాట్ బాల్స్ వేశారు. లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో మొత్తం డాట్ బాల్స్ సంఖ్య 96.

అలాగే ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన 2వ క్వాలిఫయర్ మ్యాచ్‌లో కేవలం 67 డాట్ బాల్స్ వచ్చాయి. అలాగే చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో మొత్తం డాట్ బాల్స్ 45. అంటే 4 మ్యాచ్‌ల నుంచి మొత్తం 292 డాట్ బాల్స్ వేశారు. ప్లేఆఫ్స్ దశలో ఆడిన మొత్తం నాలుగు మ్యాచ్‌ల్లో నమోదైన డాట్‌బాల్స్‌.. మొత్తం 1 లక్షా 46 వేల మొక్కలు నాటనుంది. పర్యావరణం పట్ల బీసీసీఐ బాధ్యతగా వ్యవహరిస్తూ ఈ కొత్త కార్యక్రమాన్ని చేపట్టింది.


Next Story

Most Viewed