- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనుమానాస్పద స్థితిలో యువతి మృతి
అనుమానాస్పద స్థితిలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మియపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

దిశ, శేరిలింగంపల్లి : అనుమానాస్పద స్థితిలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మియపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, ఆమె బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రానికి చెందిన గీతాంజలి (21) నగరానికి వలసవచ్చి మియాపూర్ మయూరినగర్ లో ఉన్న కోరుకొండ కోచింగ్ సెంటర్ లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుంది. ఈనెల 5వ తేదీ నుండి కోచింగ్ సెంటర్ కు సెలవులు ఇవ్వడంతో ఆమె అక్కడే డ్యూటీ చేస్తుంది. రోజులాగే ఈనెల 8వ తేదీన కూడా డ్యూటీకి వెళ్లిన యువతి అదే రోజు టవల్ తో ఫ్యాన్ కు ఉరివేసుకుని
ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే మృతురాలు బంధువులు మాత్రం గీతాంజలిని లైంగికదాడి చేసి అనంతరం ఫ్యాన్ కు ఉరివేసి ఉంటారని ఆరోపిస్తున్నారు. గీతాంజలి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆమె బంధువులు కోరుకొండ కోచింగ్ సెంటర్ వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులు వారికి నచ్చచెప్పి ఆందోళన విరమింపజేశారు. అనంతరం యువతి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Tags
- suicide






