- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పూల కోసం వెళ్లి శవమై తేలాడు
by Sridhar Babu |
తామర పూల కోసం వెళ్లి ఓ రిటైర్డ్ కార్మికుడు చెరువులో పడి మృతి చెందిన సంఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో గురువారం వెలుగు చూసింది.

X
దిశ,బెల్లంపల్లి : తామర పూల కోసం వెళ్లి ఓ రిటైర్డ్ కార్మికుడు చెరువులో పడి మృతి చెందిన సంఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో గురువారం వెలుగు చూసింది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బెల్లంపల్లి బస్తీకి చెందిన పోతరాజుల నరసయ్య (60) బుధవారం సాయంత్రం పూల కోసమని ఇంటి నుంచి పోచమ్మ చెరువుకు వెళ్లాడు. తామర పూల కోసం చెరువులో దిగాడు. ప్రమాదవశాత్తు నీటిలో చిక్కుకొని మునిగి పోయి మృతి చెందాడు. నరసయ్యకు భార్యా పిల్లలు ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
- Tags
- dead
Next Story






