- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వ్యవసాయ బావిలో గుర్తు తెలియని మృతదేహం
by Chintha Aamani |
మండలంలోని ఉప్పర మల్యాల గ్రామ శివారులో గల చెరువు

X
దిశ,గంగాధర : మండలంలోని ఉప్పర మల్యాల గ్రామ శివారులో గల చెరువు సమీపంలోని బావిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మృతుడికి సుమారు 45 ఏళ్లు ఉంటాయని గ్రామస్థులు చెప్పారు. మృతదేహం గుర్తు పట్టలేని విధంగా ఉందన్నారు. గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఉప్పర మల్యాల గ్రామ శివారు లోని వ్యవసాయ బావిలో ఒక గుర్తు తెలియని మగ మృతదేహం లభ్యమైందని, సుమారు 45 సంవత్సరాల వయస్సు, నీలం రంగు ప్యాంటు, లేత నీలం రంగు టీ షర్ట్ ధరించి ఉన్నాడని, ఈ గుర్తు తెలియని శవం, మరణం పైన కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడమైనదని ఎస్సై నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ మృతదేహం ఆచూకీ తెలిసిన వారు గంగాధర పోలీస్ స్టేషన్ ఎస్ఐ నరేందర్ రెడ్డిని ని సంప్రదించవలసినదిగా సూచించారు.
Next Story






