- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
వేధింపులు తాళలేక యువతి బలవన్మరణం
దిశ, ఖమ్మంరూరల్ : ఖమ్మం జిల్లా రూరల్ మండలంలోని తనగంపాడు పంచాయతీలో గల గుండాల తండాలో విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ మైనర్ యువతిని మరో మహిళ వేధించడంతో మనస్థాపానికి గురై కలుపు మందు తాగి చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన భూక్య లావణ్య(17) ఖమ్మం నగరంలోని ఉమెన్స్ కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతూ హాస్టల్లో ఉంటుంది. ఆ యువతి పండుగలకు ఇంటికి వచ్చి వెళ్తున్న క్రమంలో ఇదే గ్రామానికి చెందిన అజ్మీర గోపి అనే వ్యక్తి యువతి తండ్రి ఫోన్ ద్వారా ఆమెతో మాట్లాడేవాడు. దీన్ని గమనించిన గోపి భార్య అజ్మీరా రేణుక సదరు యువతిని బెదిరించడంతోపాటు మందలించింది. అక్కడితో ఆగకుండా తన భర్తతో అక్రమ సంబంధం పెట్టుకుందని ఊర్లో ప్రచారం చేసింది.
అంతేకాకుండా తిడుతూ చావరాదంటూ సదరు యువతిని తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. దీనికి ఆమె భర్త అజ్మీరా గోపి, మామయ్య అజ్మీరా బాసు వత్తాసు పలికారు. ఈ క్రమంలో ఈనెల 16వ తేదీన కలుపు మందు తాగడంతో కుటుంబ సభ్యులు కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తుండగా తుది శ్వాస విడిచింది. కాగా కుటుంబ సభ్యులు యువతి మృతదేహాన్ని పోస్ట్మార్టం అనంతరం నిందితుల ఇంటి ఎదుట ఉంచి ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న ఎస్ హెచ్ ఓ ముష్కరాజ్ ఘటనా స్థలానికి చేరుకొని వారిని సముదాయించడంతో వివాదం ముగిసింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని యువతి తండ్రి భూక్య మోహన్ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
- Tags
- suicide