- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
RTC Bus Accident:ఆర్టీసీ బస్సు బీభత్సం..ఇద్దరు మృతి
by Jakkula.Mamatha |
విజయవాడలోని బీఆర్టీఎస్ రోడ్డులో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

X
దిశ,వెబ్‌డెస్క్:విజయవాడలోని బీఆర్టీఎస్ రోడ్డులో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. గుణదల పడవల రేవు సెంటర్ సమీపంలో సాయంత్రం వాకింగ్ చేసుకునే వారిపై ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. ఆ ఆర్టీసీ బస్సు గవర్నర్ పేట డిపోకు చెందినదిగా స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో బస్సు కింద పడి ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. మృతులు వంగర అప్పారావు, కోల సత్యబాబుగా గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Next Story






