- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Accident : పండగ పూట విషాదం…బొలెరో వాహనం ఢీకొని చిన్నారి మృతి
అక్రమంగా బియ్యం తరలించే బొలెరో వాహనం స్థానికంగా ఆడుకుంటున్న ఐదేళ్ల చిన్నారిని ఢీకొట్టింది. దీంతో చిన్నారి వాహనం కింద నలిగి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన కేంద్రంలోని శ్రీపురం రోడ్డులో శనివారం వెలుగు చూసింది.

దిశ, నాగర్ కర్నూల్ :- అక్రమంగా బియ్యం తరలించే బొలెరో వాహనం స్థానికంగా ఆడుకుంటున్న ఐదేళ్ల చిన్నారిని ఢీకొట్టింది. దీంతో చిన్నారి వాహనం కింద నలిగి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన కేంద్రంలోని శ్రీపురం రోడ్డులో శనివారం వెలుగు చూసింది. స్థానికులు బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. చర్ల ఇటిక్యాల గ్రామానికి చెందిన మల్లేష్ జిల్లా కేంద్రంలోని పాపయ్య నగర్ లో అద్దె ఇంట్లో ఉంటూ ఆటో నడుపుకొని జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
తన చిన్న కూతురు కావేరి ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగా బియ్యం తరలించే బొలెరా వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందింది. కుటుంబ సభ్యులు వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నిర్లక్ష్యంగా వాహనం నడిపిన డ్రైవర్ వాహనాన్ని వదిలి నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. అనంతరం బాధితులను బియ్యం తరలించే కొందరు వ్యక్తులు బెదిరింపులకు దిగుతు, డబ్బులు ఇస్తాం కేసు వాపసు తీసుకోవాలని బలవంతం చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. పాప ప్రాణం ఖరీదు రూ. 4, లక్షల 50 వేలు ముట్ట చెప్పి పోలీస్ స్టేషన్లో కేసు కాంప్రమైజ్ చేసినట్లు తెలిసింది.






