crime : అవంచ గ్రామంలో విషాదం…చెరువులో పడి యువకుడు మృతి

by Kalyani |
crime : అవంచ గ్రామంలో విషాదం…చెరువులో పడి యువకుడు మృతి
X

దిశ, నర్సాపూర్ : గణేష్ నిమజ్జనం ఏర్పాటులో భాగంగా చెరువులో ట్రాక్టర్ కడగడానికి వెళ్లి కాలుజారిమట్టి కోసం తీసిన గుంతలో పడి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని ఆవంచ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన గంట భూమమ్మ కుమారుడు గంట శ్రీనివాస్ (26) గ్రామంలో ఏర్పాటు చేసిన ఓ వినాయక విగ్రహం నిమజ్జనం కోసం శనివారం స్థానిక పెద్ద చెరువులో స్నేహితులతో కలిసి ట్రాక్టర్ ను కడగడానికి వెళ్ళాడు. ట్రాక్టర్ కడుగుతుండగా చెరువులో మట్టి కోసం తీసిన గుంతలో కాలుజారి పడి గల్లంతయ్యాడు. వెంటనే స్నేహితులు, గ్రామస్తులు చెరువులో గాలించి బయటకు తీయగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. శ్రీను మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా శ్రీను తండ్రి గతంలో మృతి చెందగా తల్లి భూమమ్మ తో కలిసి ఉంటూ వ్యవసాయంతో పాటు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఒక్కగానొక్క కొడుకు మృతితో తల్లి రోదనలు అక్కడున్న వారిని కంటతడి పెట్టించాయి.

Advertisement

Next Story

Most Viewed